టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం “బుజ్జి ఇలా రా”. సైకలాజికల్ థ్రిల్లర్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. కొన్నాళ్ల కితమే అనౌన్స్ కాబడిన ఈ చిత్రం ట్యాగ్‌లైన్ ను బట్టే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. చాందిని అయ్యంగార్ హీరోయిన్గా నటిస్తుంది. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశవ్ నాయుడు పాత్రలో నటిస్తున్న ధన్‌రాజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని సునీల్ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ధన్రాజు ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నడుస్తుండగా, సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలో నటిస్తున్నాడు. కయ్యూమ్ పాత్రలో సునీల్ గెటప్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గరుడవేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో పాటు సినిమాటోగ్రాఫర్‌గా కూడా వర్క్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు.


