చిన్న సినిమాలతో పెద్ద హిట్లు ఇస్తున్న దర్శుకుడు మారుతితో, కమెడియన్ గా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారిన సునీల్ ఒక సినిమా తీయబోతున్నారు. దానయ్య నిర్మాతగా వ్యవహరించాబోతున్న ఈ సినిమా జూన్ నెలలో మొదలుకాబోతుంది. ప్రస్తుతం మారుతి ఈ సినిమా స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ సినిమా కథ నచ్చడంతో సునీల్ ఈ ప్రాజెక్ట్ కు సై అన్నారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిర్మాత దానయ్య మరియు సునీల్ కు చాలా రోజుల నుండి మంచి హిట్ లేనందున, ఈ సినిమాతో పెద్ద హిట్ ఇవ్వాలని వీరిద్దరు భావిస్తున్నారు.


