నేడే 2 కంట్రీస్ ఆడియో విడుదల !

13th, December 2017 - 09:41:03 AM

సునీల్ హీరోగా శంకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘2 కంట్రీస్’. మనీషారాజ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మలయాళంలో విజయం సాధించిన ‘2 కంట్రీస్’ మూవీని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసి విడుదల చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చెయ్యడం జరిగింది.

పృథ్వి, నరేష్, శ్రీనివాస్ రెడ్డి పాత్రలు ఈ సినిమాకు హైలెట్ కాబోతున్నాయి. ఆడియన్స్ కు బోర్ కొట్టించకుండా దర్శకుడు పూర్తి వినోదభరితంగా ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఇటివల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ రోజు సాయంత్రం ఆడియో విడుదల చెయ్యనున్న చిత్ర యూనిట్ ఈ నెల చివరన సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఈ మూవీ తో సునీల్ హిట్ కొట్టే ఛాన్స్ ఉందని సిని వర్గాలో టాక్.