‘చిత్రలహరి’ కోసం సునీల్.. !
Published on Feb 12, 2019 11:47 am IST


‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ‘చిత్రలహరి’ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్నాడు. కాగా తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ కార్య క్రమాలను మొదలు పెట్టింది. సునీల్ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ‘చిత్ర’ పాత్రలో నటిస్తుండగా .. మరో హీరోయిన్ నివేత పేతురాజ్ ‘లహరి’ పాత్రలో నటిస్తోంది.

కాగా ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook