అల్లు అర్జున్ 19 లో ప్రముఖ హాస్య నటుడు !

Published on Mar 14, 2019 8:40 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవ చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న స్టార్ట్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటించనున్నాడు.

గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :

More