సునీల్ విలన్ లా సెటిల్ అవుతాడా?

Published on Aug 6, 2020 5:01 pm IST

కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం కలర్ ఫోటో. ఈ చిత్ర టీజర్ నిన్న విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పటి వరకు వన్ మిలియన్ మంది ఈ టీజర్ ని యూట్యూబ్ లో చూడడం జరిగింది. దర్శకుడు సందీప్ రాజ్ విలేజ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నల్లబాలుడు సుహాస్ తెల్లటి అందమైన చాందిని చౌదరిల లవ్ కహాని ఆకట్టుకొనేలా కనిపిస్తుంది.

ఐతే ఈ మూవీలో నటుడు సునీల్ సీరియస్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రేమ జంటను అడ్డుకొనే రౌడీ పోలీసుగా సునీల్ పాత్ర ఉంటుందనిపిస్తుంది. ఇక ఈ మూవీ టీజర్ లో సునీల్ చెప్పిన ‘ప్రేమ గొప్పదా, భయం గొప్పదా’ డైలాగ్ ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత సునీల్ విలన్ గా సెటిల్ అయిపోతాడేమో అనిపిస్తుంది. ఇప్పటికే డిస్కో రాజా మూవీలో సునీల్ విలన్ రోల్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More