మోసగాళ్లు చిత్రం నుండి సునీల్ శెట్టి సాలిడ్ పోలీస్ లుక్

Published on Feb 29, 2020 11:10 pm IST

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్లు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన ఓ ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు అర్జున్ అనే ఐటీ ప్రొఫెషనల్ గా కనిపించనున్నాడు. మంచు విష్ణు పాత్ర ఆన్లైన్ మోసాలకు పాల్పడే ఇంటెలిజెంట్ హ్యాకర్ గా ఉండే అవకాశం కలదు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా నేడు ఈ చిత్రంలోని సునీల్ శెట్టి లుక్ విడుదల చేశారు. తలపాగా ధరించి పోలీస్ గెటప్ లో ఉన్న సునీల్ శెట్టి లుక్ సాలిడ్ గా ఉంది. హీరోని వెంటాడే ఇన్వెస్టిగేటివ్ అధికారిగా సునీల్ శెట్టి రోల్ ఉండే అవకాశం కలదు. మోసగాళ్లు చిత్రానికి జెఫరీ గీ చిన్ దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :