ఆలీని ఫాలో అయితే సునీల్ పరిస్థితి వేరేలా ఉండేది.

Published on Aug 27, 2019 8:42 am IST

కమెడియన్ నుండి హీరోగా మారీన సునీల్ కెరీర్ ప్రస్తుతం నెమ్మదించింది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలిగిన సునీల్ హీరోగా మారి వరుస సినిమాలు చేశారు. మొదట్లో హీరోగా ఆయన చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులు ఆ తరువాత తిరస్కరించారు. పూలరంగడు మూవీ తరువాత సునీల్ సోలో హీరోగా చేసిన చిత్రాలన్నీ పరాజయం పాలైనాయి. ఒకప్పుడు కమెడియన్ అయినప్పటికీ హీరోతో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకునే వారు సునీల్. అలాంటిది ఇప్పుడు ఆయన నటిస్తున్న చిత్రాల గురించి కనీస సమాచారం లేదు.

కామెడీ హీరోగా కొనసాగాల్సిన సునీల్ సిక్స్ ప్యాక్ తో సీరియస్ హీరోగా మారినప్పటినుండే ఆయనకు సినిమా కష్టాలు మొదలయ్యాయి. మాస్ హీరోగా మారాలన్న ఆయన ఆలోచన బెడిసికొట్టింది. దీనితో ప్రస్తుతం సునీల్ కి ప్రాధాన్యం ఉన్న ఫుల్ టైం కమెడియన్ పాత్రలు కూడా రావడం లేదు. ఈ విషయంలో సీనియర్ కమెడియన్ అలీ సలహా సునీల్ తీసుకుంటే బాగుండేది.

సీనియర్ కమెడియన్ అలీ కూడా యమలీల, ఘటోత్కచుడు వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఆయన ఓ పక్క కమెడియన్ పాత్రలు వేస్తూ వచ్చారు. ఆయన కామెడీ హీరోగా ఎదగాలని ప్రయత్నించారు కానీ ఎప్పుడూ ఓ మాస్ హీరో గా ఎదగాలని ప్రయత్నించలేదు. అది ఆయన కెరీర్ సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో ఉండేలా చేసింది. సునీల్ దీనికి భిన్నంగా ప్రయత్నించి విఫలం చెందారు. ఈ విషయంలో సునీల్ అలీ సలహా తీసుకొనివుంటే బాగుండేది.

సంబంధిత సమాచారం :