కమెడియన్ నుంచి కామెడీ హీరోగా, కామెడీ హీరో నుంచి విలన్స్ ని చితకబాదే మాస్ 6 ప్యాక్ హీరోగా మారిన నటుడు సునీల్. ‘జోష్’ సినిమా దర్శకుడు వాసు వర్మ డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి ‘కృష్ణాష్టమి’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న శ్రీకృష్ణాష్టమి కానుకగా ఒక పోస్టర్ ని రిలీజ్ చెయ్యడమే కాకుండా, ఈ రోజు ఉదయం ‘కృష్ణాష్టమి’ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు.
కృష్ణాష్టమి ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా గత సినిమాలకంటే ఈ సినిమాలో సునీల్ లుక్ డిఫరెంట్ గా ఉంది. దానికి మించి దినేష్ అందించిన మ్యూజిక్ మరియు టీజర్ బిట్ సాంగ్ సూపర్బ్ గా ఉండడం ఒక ఎత్తైతే, చోట కె నాయుడు విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కృష్ణాష్టమి విజువల్స్ మరియు మ్యూజిక్ కి సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గాల్రాని, డింపుల్ చోపడే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
టిజేర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


