సునీల్ న్యూ మూవీ ఫస్ట్ షెడ్యూల్ డీటైల్స్

సునీల్ న్యూ మూవీ ఫస్ట్ షెడ్యూల్ డీటైల్స్

Published on Aug 10, 2015 11:26 AM IST

sunil
కమెడియన్ గా తెలుగు ప్రజలకు గిలిగింతలు పెట్టి కడుపుబ్బా నవ్వించిన సునీల్ ప్రస్తుతం హీరోగా మారి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ‘భీమవరం బుల్లోడు’ సినిమా తర్వాత సునీల్ తరువాతి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అందులో భాగంగానే సునీల్ ఈ ఏడాది తన సినిమాలు చేయడంలో వేగాన్ని పెంచాడు. అందులో భాగంగా ముందుగా జోష్ సినిమా ఫేం వాసు వర్మ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాని చివరి దశకు తీసుకోచ్చేసాడు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుండడం తో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో రీలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇది కాకుండా సునీల్ ఇప్పటికే ‘రక్ష’ ఫేం వంశీ ఆకెళ్ళ డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ముహూర్తం కుదిరింది. ఈ చిత్ర టీం తెలిపిన సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు 18 నుంచి హైదరాబాద్ లో మొదలు కానుంది. సునీల్ సరసన బాలీవుడ్ భామ బార్బీ చోప్రా (మన్నార) హీరోయిన్ గా నటించనుంది. ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత సుదర్శన్ రెడ్డి ఆర్.పి.ఏ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు