
కమెడియన్ నుంచి కామెడీ హీరోగా, కామెడీ హీరో నుంచి విలన్స్ ని చితకబాదే 6 ప్యాక్ ఉన్న హీరోగా ఎదిగిన నటుడు సునీల్. భీమవరం బుల్లోడు తర్వాత బాగా లాంగ్ గ్యాప్ తీసుకున్న సునీల్ ‘జోష్’ సినిమా దర్శకుడు వాసు వర్మ డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా చేసిన సినిమా ‘కృష్ణాష్టమి’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు. కృష్ణాష్టమి ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గత సినిమాలకంటే ఈ సినిమాలో సునీల్ లుక్ డిఫరెంట్ గా కనిపించనున్నాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ భాగం నవంబర్ రెండవ అర్ధభాగంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కృష్ణాష్టమి టీజర్ లోవిజువల్స్ మరియు మ్యూజిక్ కి సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గాల్రాని, డింపుల్ చోపడే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. సునీల్ ఈ సినిమా సక్సెస్ పై చాలా ఆశలే పెట్టుకొని ఉన్నాడు. ఇది కాకకుండా సునీల్ వంశీ కృష్ణ ఆకెళ్ళ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది.

