
శేఖర్ కమ్ముల పుణ్యమా అని కెరీర్ లో మొదటిసారిగా ప్రముఖ గాయని సునీత కొత్త అవతారమెత్తింది. శేఖర్ తీస్తున్న అనామిక ప్రచార పాటలో కెరీర్ లో మొదటిసారిగా నటించింది. ఈరోజు విడుదలైన ఈ పాటతో చాలామంది హృదయాలను సునీత కొల్లగొట్టింది అని సమాచారం
ఈ మొత్తం పాటను శేఖర్ ప్రియ శిష్యుడైన అనీష్ కురువిల్లా తెరకెక్కించాడు. క్షణం క్షణం అంటూ సాగే ఈ పాటను చార్మినార్ పరిసర ప్రాంతాలలో తెరకెక్కించారు. కీరవాణి స్వరాలను అందించారు
నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హర్షవర్ధన్ రానే, వైభవ్ ముఖ్యపాత్రధారులు. కనబడకుండా పోయిన తన భర్తను వెతుక్కుంటూ సాగే సినిమాను శేఖర్ అందంగా తెరకెక్కించాడని సమాచారం. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో మే 1న విడుదలకానుంది

