సమీక్ష : బోర్డర్ 2 – అక్కడక్కడ మెప్పించే వార్ యాక్షన్ డ్రామా

సమీక్ష : బోర్డర్ 2 – అక్కడక్కడ మెప్పించే వార్ యాక్షన్ డ్రామా

Published on Jan 23, 2026 7:19 PM IST

Border 2

విడుదల తేదీ : జనవరి 23, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దొసాంజ్, అహాన్ శెట్టి, సోనమ్ బాజ్వా, మోనా సింగ్ తదితరులు
దర్శకుడు : అనురాగ్ సింగ్
నిర్మాతలు: భూషన్ కుమార్, కృషన్ కుమార్, జెపి దత్తా, నిధి దత్తా
సంగీతం : అను మాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా, సచేత్-పరంపరా, గుర్మో
ఛాయాగ్రహణం : అన్షుల్ చోబి
కూర్పు : మనీష్ మోరె

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 
బాలీవుడ్ క్లాసిక్ చిత్రాల్లో వార్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘బోర్డర్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే, దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ను రూపొందించారు. దర్శకుడు అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సీక్వెల్ చిత్రంలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దొసాంజ్, అహాణ్ శెట్టి లీడ్ రోల్స్‌లో నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

1971 సమయంలో జరిగిన ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. నిర్మల్ జిత్ సింగ్ సెఖాన్(దిల్జిత్ దొసాంజ్), మేజర్ హోషియార్ సింగ్ దహియా(వరుణ్ ధావన్), లెఫ్టినెంట్ క్యాడర్ మహేంద్ర ఎస్ రావత్(అహాన్ శెట్టి) ముగ్గురు ప్రాణ స్నేహితులు. సెఖాన్ పెళ్లి వేడుక కోసం వీరందరు ఒకచోట చేరుతారు. అయితే, భారత ఆర్మీ నుంచి వీరందరికీ అర్జెంట్ కాల్ వస్తుంది. పాక్‌తో యుద్ధంలో భాగంగా చాలా మంది సైనికులను ఈస్ట్ పాకిస్థాన్‌కు పంపుతారు. అయితే, లెఫ్టినెంట్ కల్నల్ ఫతేహ్ సింగ్ కాలెర్‌తో కలిసి ఈ ముగ్గురు సైనికులు రాజస్థాన్, పంజాబ్, జమ్మూ-కాశ్మీర్ గుండా జరుగుతున్న పాక్ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ముగ్గురు హీరోల మధ్య స్నేహం చుట్టూ తిరుగుతుంది. దీనికి సంబంధించిన పోర్షన్స్ బాగా తెరకెక్కించారు. ఈగోతో మొదలైన వారి స్నేహం ఎంత బలంగా మారుతుందనేది చక్కగా చూపెట్టారు. కామెడీ, మ్యూజిక్ నీట్‌గా కథకు తగ్గట్టుగా వస్తుంటాయి.

ముగ్గురు హీరోలకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ను ఎమోషనల్ టచ్‌తో సాగేలా చూసుకున్నారు. సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌తో సాగే సన్నీ డియోల్ పవర్‌ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో సన్నీ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ మాస్ ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

వరుణ్ ధావన్‌ను ప్రమోషనల్ కంటెంట్‌తో ట్రోల్ చేసిన వారికి ఆయన తన పర్ఫార్మెన్స్‌తో గట్టి సమాధానమిచ్చాడు. సైనికుడిగా ఆయన చేసిన నటన బాగుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంలో వరుణ్ ధావన్ సక్సెస్ అయ్యాడు.

మైనస్ పాయింట్స్ :

వార్ ఎపిసోడ్స్ మొదలైన తర్వాత సినిమా ట్రాక్ తప్పినట్లుగా అనిపిస్తుంది. సహజత్వం లేని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెప్పించవు. తొలి భాగంతో పోల్చుకుంటే, ఈ సినిమాలోని వార్ ఎత్తుగడలు, ఒకరితో ఒకరు పోరాడే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.

దిల్జిత్ చేసే ఎయిర్ ఫైట్ సీక్వెన్స్, అహాన్ శెట్టి చేసే నీటిపై యాక్షన్ సీక్వెన్స్‌లు బలహీనమైన వీఎఫ్ఎక్స్ కారణంగా ఏమాత్రం ఆకట్టుకోవు. సినిమాకు చాలా డ్యామేజ్ చేసేలా ఈ సీక్వెన్స్‌లు ఉంటాయి. కనీస జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది అని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా ఈ సీక్వెన్స్‌లు ఉంటాయి.

ఎలాంట అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోయినా తొలి భాగంలోని వార్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయి కానీ, ‘బోర్డర్ 2’లో మాత్రం ఈ వార్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెప్పించవు. అటు వార్ సీన్స్‌లో వచ్చే ఎమోషనల్ టచ్ కూడా తొలి భాగంలోనే బాగుంటాయి. ఈ సినిమాలో అవి కూడా వర్కవుట్ కాలేదు. ఇక ఈ సినిమా నిడివి చాలా పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు అనురాగ్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంవతరకు బాగానే ఉన్నా, సెకండాఫ్ మాత్రం ఆకట్టుకోదు. తొలి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. సంగీతం బాగున్నా మిగతా టెక్నికల్ అంశాలు ఆకట్టుకోవు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనితనం చాలా పూర్‌గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు సహజత్వాన్ని లోపిస్తాయి. ఎడిటింగ్ వర్క్ మెప్పించలేదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘బోర్డర్’ చిత్రం క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌తో ఈ ‘బోర్డర్ 2’ మూవీ ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు. మిగతా నటీనటులకు పెద్దగా స్కోప్ ఉండదు. ఈ సినిమాలోని వార్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. ఆకట్టుకోని వీఎఫ్ఎక్స్, వీక్ ప్రెజెంటేషన్ కారణంగా సెకండాఫ్ సినిమాకు డ్యామేజ్ చేసింది. ఈ చిత్రాన్ని తొలిభాగం రేంజ్‌లో కాకుండా తక్కువ అంచనాలతో వీక్షించడం బెటర్.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు