బిగ్ బాస్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీ!

Published on Dec 19, 2021 10:53 pm IST


బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఫైనల్ కి చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ షో ఐదవ సీజన్ చివరి వరకు సన్ని, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్ లు ఉన్నారు. కాగా వీరి లో మానస్ ఎలిమినేట్ అయినట్లు ముఖ్య అతిధులుగా వచ్చిన న్యాచురల్ స్టార్ నాని ప్రకటించడం జరిగింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వచ్చిన అనంతరం తన అనుభవాల గురించి వివరించారు మానస్.

ఎట్టకేలకు ఫైనల్ లో సన్నీ విన్నర్ గా నిలిచాడు. ఎంతో క్రేజ్ తో బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు. హౌజ్ చివరి వారం మరింత ఆసక్తి గా సాగగా, సన్ని టైటిల్ గెలుపు తో మరింత జోష్ గా బిగ్ బాస్ ముగిసింది అని చెప్పాలి. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ షో ఫైనల్ సినీ పరిశ్రమ కి చెందిన నటీనటులతో అంగరంగ వైభవంగా జరిగింది.

సంబంధిత సమాచారం :