సూపర్ క్లిక్ : మెగా పవర్ స్టార్ తో మెగా ప్రిన్స్

సూపర్ క్లిక్ : మెగా పవర్ స్టార్ తో మెగా ప్రిన్స్

Published on Dec 21, 2022 9:23 PM IST


టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలుగా ఒక్కో సినిమాతో మంచి విజయాలని అలానే ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ ని అందుకుంటూ దూసుకెళ్తున్న వారిలో మెగాస్టార్ కుమారుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అలానే మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఉంటారు అనే చెప్పాలి. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ తో సూపర్ డూపర్ హిట్ ని రామ్ చరణ్ అందుకోగా ఎఫ్ 3 మూవీ సూపర్ హిట్ తో వరుణ్ తేజ్ మంచి జోరు మీదున్నారు.

ఇక తరచు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా చరణ్, వరుణ్ ఇద్దరూ కూడా తమ సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. విషయం ఏమిటంటే, ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని రామ్ చరణ్, ఉపాసన ల ఇంట్లో నిన్న గ్రాండ్ గా నిర్వహించగా పలువురు మెగాస్టార్ కుటుంబసభ్యులు దీనికి హాజరై ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. కాగా ఈ వేడుకలో తన కో బ్రదర్ రామ్ చరణ్ తో కలిసి సపరేట్ గా దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్ ని కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మిస్టర్ క్లాజ్ విత్ మిస్టర్ సి అంటూ వరుణ్ తేజ్ క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు