టాలీవుడ్లో సేతుపతి క్రేజ్.. ఆ సినిమాను కొనేశారు

Published on Feb 23, 2021 12:45 am IST

విజయ్ సేతుపతి క్రేజ్ తమిళ ఇండస్ట్రీ దాటి ఇతర భాషల్లోకి ప్రవేశించింది. తెలుగులో ఆయన పాపులారిటీ బాగా పెరిగింది. ‘మాస్టర్’ డబ్బింగ్ వెర్షన్ హిట్ కావడం, ‘ఉప్పెన’ చిత్రంలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కడంతో తెలుగులో ఆయనకు ఆఫర్లు పెరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు అయితే సేతుపతి సినిమాలంటే అమితాసక్తిని చూపుతున్నారు. ఏ భాషలో ఆయన సినిమా వచ్చినా వెతుక్కుని మరీ చూస్తున్నారు. అందుకే ఆయన గత చిత్రాల్లో ఒకటైన ‘సూపర్ డీలక్స్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.

సిద్దేశ్వర వైష్ణవి ఫిలిమ్స్ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకుందట. 2019లో వచ్చిన ఈ తమిళ డార్క్ కామెడీ డ్రామాను త్యాగరాజన్ కుమారరాజా డైరెక్ట్ చేశారు. విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు చేశారు. వాటిలో సేతుపతి ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించారు. ఆ పాత్రలో ఆయన నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. సినిమా మంచి వసూళ్లను కూడ సాధించింది. మరి రీమేక్ హక్కుల్ని కొన్న నిర్మాణ సంస్థ తెలుగులో కూడ విజయ్ సేతుపతినే ఆ పాత్ర కోసం ఎంచుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More