‘అఖిల్’ ఫస్ట్ మూవీకి సూపర్బ్ ఓపెనింగ్స్

‘అఖిల్’ ఫస్ట్ మూవీకి సూపర్బ్ ఓపెనింగ్స్

Published on Nov 8, 2015 12:40 AM IST

akhil

అక్కినేని ఫ్యామిలీతో పాటు, అక్కినేని అభిమానులు మరియు తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘అఖిల్’. ఈ సినిమా ఇంతమందిలో ఆసక్తిని క్రియేట్ చెయ్యడానికి కారణం అక్కినేని ఫ్యామిలీ మూడవ తరం వారసుడు, నాగార్జున – అమలల ముద్దుల తనయుడు అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అవుతున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని దీపావళి కానుకగా నవంబర్ 11న రిలీజ్ కానుంది.

అఖిల్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ సినిమాకి మాత్రం సూపర్బ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఒక్క నైజాంలోనే సుమారు 400 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో కూడా సుమారు 400కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అలాగే కర్ణాటక, తమళనాడులో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లోకల్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఒక ఎస్టాబ్లిష్ స్టార్ హీరో రేంజ్ లో రిలీజ్ అవుతుండడం విశేషం. అఖిల్ మొదటి సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు