‘చీకటి రాజ్యం’ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్!

‘చీకటి రాజ్యం’ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్!

Published on Sep 20, 2015 2:09 AM IST

Kamal-Cheekati-Rajyam

‘చీకటి రాజ్యం’.. ప్రయోగాలకు పెట్టింది పేరైన కమల్ హాసన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ప్రయోగాత్మక సినిమా. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ‘తూంగవనం’ పేరుతో తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘చీకటి రాజ్యం’ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్ 16న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ విడుదలైన నాటినుంచే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలుస్తూ దూసుకుపోతోంది.

కమల్ హాసన్ హీరోగా చేసిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాజేష్ ఎమ్ సెల్వ ఈ రేసీ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. రాజేష్ సూపర్బ్ టేకింగ్ ఈ ట్రైలర్‌లో అడుగడుగునా హైలైట్ అవుతూ వచ్చింది. ఇక ఉత్తమ విలన్‌ దగ్గర్నుంచి స్వయంగా డబ్బింగ్ చెప్పడం పారంభించిన కమల్, “వాడి షర్ట్ కొంచెం నలిగినా చంపేస్తా. నేను చెప్తే చేస్తా” అంటూ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక విడుదలైన రెండు రోజుల్లోనే ఈ ట్రైలర్ 15లక్షల పై చిలుకు వ్యూస్‌తో దూసుకుపోతోంది. తమిళంలో తూంగవనంగా తెరకెక్కిన ఈ సినిమా రెండు వర్షన్స్‌ వ్యూస్ కలిపి ఇప్పటివరకూ 15లక్షలు దాటింది. దీంతో కమల్ హాసన్ చీకటి రాజ్యం సినిమాకు ఉన్న క్రేజ్ మరోసారి ఋజువు అయింది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు