కన్నడ బ్లాక్ బస్టర్ “కాంతార” కి అద్దిరిపొయే టీఆర్పీ!

Published on Feb 2, 2023 6:05 pm IST

రిశబ్ శెట్టి హీరోగా నటించి, రచన, దర్శకత్వం వహించిన చిత్రం కాంతార. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం స్టార్ మా లో ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ రిలీజ్ అయ్యింది.

ఈ చిత్రానికి 12.3 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అని చెప్పాలి. బుల్లితెర పై కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అద్బుతం. ఈ చిత్రం లో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ పై నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :