వన్ మిలియన్ లైక్స్ వైపు దూసుకు పోతున్న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్!

Published on Aug 10, 2021 7:24 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట చిత్రం నుండి సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ అంటూ చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ భారీ వ్యూస్ ను సాధించడం జరిగింది. అంతేకాక ఈ చిత్ర టీజర్ 800 కే లైక్స్ ను సాధించి వన్ మిలియన్ లైక్స్ వైపు దూసుకు పోతుంది. ఈ మేరకు సర్కారు వారి పాట చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ చేయడం జరిగింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రానికి దర్శకత్వం పరశురాం అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :