సుభాష్ రెడ్డి గారు మీరే నిజమైన హీరో – మహేష్ బాబు

Published on Nov 10, 2021 5:03 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ప్రేరణ తో సుభాష్ రెడ్డి చేసిన పనికి ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక పాటశాల నిర్మాణం కోసం సుభాష్ రెడ్డి శ్రీమంతుడు ను ప్రేరణ గా తీసుకోవడం పట్ల మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదిక గా ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ పాటశాల వెనుక శ్రీమంతుడు ఒక ప్రేరణ అని తెలుసు కోవడానికి పదాలు రావడం లేదు అని అన్నారు. సుభాష్ రెడ్డి గారు మేము చాలా వినయ పూర్వకంగా ఉన్నాము, మీరే నిజమైన హీరో, మీలాంటి వారు మాకు ఇంకా కావాలి అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు. అంతేకాక ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత శ్రీమంతుడు బృందం తో తప్పకుండా సందర్శిస్తా అని వ్యాఖ్యానించారు. మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :