సూపర్ స్టార్ మహేష్ బాబుకి పుత్రోత్సాహం !

Published on Jun 18, 2021 1:02 am IST

సూపర్ స్టార్ మ‌హేశ్ కుమారుడు గౌత‌మ్ స్విమ్మింగ్‌ లో నెల‌కొల్పిన రికార్డు గరించి సోషల్ మీడియా వేదికగా మహేష్ సతీమణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టాప్ 8 ఈత‌గాళ్ల జాబితాలో గౌతమ్ స్థానం సంపాదించాడు. ఈ వార్త మహేష్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. గౌతమ్ సాధించిన ఈ ఘనత చాల తక్ఏకువ టైంలో సాధించడం విశేషం. 2018లో ఫ్రొఫెష‌న‌ల్ స్విమ్మర్‌గా మారాడు గౌత‌మ్.

పైగా కేవలం 15 ఏళ్ల వ‌య‌సులోనే తన కుమారుడు ఈ రికార్డ్ ను సాధించినందుకు మహేష్ బాబు చాల సంతోషంగా ఉన్నాడని, మహేష్ బాబుకి పుత్రోత్సాహం కలిగిందని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గౌత‌మ్‌ స్విమ్మింగ్ గురించి నమ్రత చెబుతూ.. ‘గౌతమ్ 3 గంట‌ల్లో 5 కి.మీ. దూరాన్ని ఈద‌గ‌ల‌డు. బ‌ట‌ర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్‌, బ్రెస్ట్ స్ట్రోక్‌, ఫ్రీ స్టైల్ అనే నాలుగు ప‌ద్ధ‌తుల్లో చాల వేగంగా గౌతమ్ ఈత కొడ‌తాడు అంటూ న‌మ్ర‌తా చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :