టాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్!

Published on Aug 10, 2021 9:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకులు, అభిమానులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, మరెందరో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో సైతం ఈ ట్రెండ్ భారీగా కొనసాగింది అని చెప్పాలి. అయితే తెలుగు సినీ పరిశ్రమ లో మరే హీరోకి లేని విధంగా ట్విట్టర్ లో ఒక ట్రెండ్ ను మహేష్ బాబు సెట్ చేశారు అని చెప్పాలి. ట్విట్టర్ స్పేస్ లో 20 మందికి పైగా సెలబ్రిటీ లు మహేష్ బాబు తో తమకు ఉన్న అనుభవాలను షేర్ చేసుకోవడం మాత్రమే కాకుండా, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా జరగడం టాలీవుడ్ లో ఇదే మొదటి సారి అని తెలుస్తోంది. ఈ విషయం తెలియడం తో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :