15 మిలియన్ క్లబ్ లో సూపర్ స్టార్ మహేష్.!

Published on Sep 1, 2021 1:10 pm IST


మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎవరికున్న క్రేజ్ వాళ్లకి సెపరేట్ అని చెప్పాలి. ఆఫ్ లైన్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీ లెవెల్లో మన స్టార్ హీరోలకి ఫాలోవర్స్ ఉన్నారు. మరి అలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. ఇప్పటికే టాలీవుడ్ లో ట్విట్టర్ నుంచి అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా మహేష్ ఉండగా ఇప్పుడు పేస్ బుక్ నుంచి 15 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి ఈ క్లబ్ లో జాయిన్ అయ్యారు.

దీనితో సోషల్ మీడియాలో కూడా మహేష్ క్రేజ్ ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :