అక్కడ కూడా ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన మహేష్.!

Published on Aug 6, 2020 4:01 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా లేడీ అమితాబ్ విజయశాంతి చాలా కాలం విరామం అనంతరం దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “సరిలేరు నీకెవ్వరు”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మహేష్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా టాలీవుడ్ లో కూడా హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

మహేష్ బ్లాక్ బస్టర్ బొమ్మ ఒక్క వెండితెర మీదకే పరిమితం కాకుండా స్మాల్ స్క్రీన్ మీద కూడా దద్దరిల్లింది. మొదటిసారి టెలికాస్ట్ చేసినపుడే ఆల్ టైం రికార్డ్ టీఆర్పీ రేటింగ్ కొల్లగొట్టడమే కాకుండా రెండో సారి కూడా అదిరిపోయే రేటింగ్ ను రాబట్టింది. అయితే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డు నెలకొల్పిన మహేష్ ఇప్పుడు కన్నడలో కూడా ఆల్ టైం రికార్డు నెలకొల్పాడు.

అక్కడ కూడా ఈ చిత్రాన్ని “మేజర్ అజయ్ కృష్ణ” గా డబ్ చేసి టెలికాస్ట్ చెయ్యగా తెలుగు డబ్బింగ్ చిత్రాల జాబితాలో ఆల్ టైం నెంబర్ 1 స్థానంలో నిలిచింది. గత కొన్ని రోజుల కితం ఈ చిత్రాన్ని అక్కడ టెలికాస్ట్ చెయ్యగా 6.5 టీఆర్పీ రేటింగ్ ను ఈ చిత్రం సాధించి మెగాస్టార్ చిరంజీవి నటించిన “సైరా నరసింహా రెడ్డి” పేరిట ఉన్న 6.3 టీఆర్పీ ను అధిగమించి టాప్ ప్లేస్ కి వచ్చింది. ఇలా మహేష్ అక్కడ కూడా ఆల్ టైం రికార్డు సెట్ చేశారు.

సంబంధిత సమాచారం :

More