RRR’ టీంతో ‘సూపర్’ సర్ప్రైజ్?

RRR’ టీంతో ‘సూపర్’ సర్ప్రైజ్?

Published on May 11, 2025 3:40 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ సెట్ చేసిన ఈ చిత్రంకి ఎం ఎం కీరవాణి ఇచ్చిన సంగీతం కూడా మేజర్ ప్లస్ అయ్యింది.

మరి ఈ సినిమా సంగీతం స్పెషల్ ఆర్కెస్ట్రాని లండన్ రాయల్ ఫిల్ హర్మానిక్ హాల్ లో లైవ్ పెర్ఫామెన్స్ ని అందించనుండగా ఈ ప్రిస్టేజియస్ ఈవెంట్ కి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హాజరు కానున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇక్కడ ఒక సూపర్ సర్ప్రైజ్ కూడా ఉంటుంది అని ఇపుడు టాక్ వినిపిస్తుంది. దీని రాజమౌళి నెక్స్ట్ సినిమా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ ఈవెంట్ లో హాజరు కానున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు