వైరల్: ‘భీమ్లా’తో సూపర్ ఉమెన్..!

Published on Aug 28, 2021 11:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన వకీల్ సాబ్ సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సూపర్ ఉమెన్ గుర్తుంది కదా.. ఆమె అసలు పేరు లిరిషా. సూపర్ ఉమెన్‌గా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన ఆమె మరోసారి పవన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. పవన్ కళ్యాణ్-రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్.

అయితే ఈ సినిమాలో సూపర్ ఉమెన్ లిరిషా నటిస్తుంది. తాజాగా భీమ్లా నాయక్ సెట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని కలిసిన సూపర్ ఉమెన్ ఆయనతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. భీమ్లా నాయక్ షూటింగ్ మూడ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో ఉన్న పవన్‌తో ఆమె దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :