కన్నడలో సూపర్ స్టార్, కానీ తెలుగులో కూడా సూపర్ ఇమేజ్ ఉన్న హీరో ఉపేంద్ర. ఆయన నటించిన ‘ఎ’, ‘ఉపేంద్ర’, ‘రా’, ‘సూపర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించించాడు. ఉపేంద్ర నటించే సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు కథ – కథనం – టేకింగ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ డిఫరెంట్ ఫ్లేవర్ లో 1999లోరిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఉపేంద్ర సినిమాకి సీక్వెల్ గా ‘ఉపేంద్ర 2’ సినిమాని తెరకెక్కించారు. చాలా రోజుల తర్వాత ఉపేంద్ర మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొని చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడంలో ‘ఉప్పి 2’ పేరుతో రిలీజ్ కానుంది.
తెలుగులో నల్లమలపు బుజ్జి నిర్మించిన ఈ సినిమాని ఆర్. శ్రీనివాస్ ఇరు రాష్ట్రాల్లోనూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇలా ఇద్దరు పెద్ద వారు ఈ సినిమాలో ఉండడంతో ఈ సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరికాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకి ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. సింగిల్ స్క్రీన్స్ లో ఇప్పటికే ఆన్ లైన్ లో 70% టికెట్స్ అమ్ముడు పోయాయి. చాలా చోట్ల ఈ సినిమాకి క్రేజ్ కూడా బాగా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో అటు డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్, నల్లమలపు బుజ్జి చాలా హ్యాపీగా ఉన్నారు. ఉపేంద్రనే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో క్రిస్టినా అఖీవా, పరుల్ యాదవ్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు.


