రూ.1000 కోట్ల ప్రాజెక్టులో నటించనున్న సూపర్ స్టార్ !

17th, April 2017 - 05:53:26 PM


ఇప్పటివరకు ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా ‘బాహుబలి’ పేరిట ఉన్న రికార్డుల్ని కొల్లగొట్టడానికి త్వరలోనే ఒక చిత్రం రూపొందనుంది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. సుమారు రూ. 1000 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ‘ది మహాభారత’ అనే పేరును ఖరారు చేశారు.

ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంత్రఫిస్ట్ అయిన డా. బి. ఆర్.శెట్టి నిర్మించనున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నారు. దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మొత్తం రెండు భాగాలుగా రూపొందించబడే ఈ సినిమాని మలయాళం, తమిళం, కన్నడం, హిందీ, తెలుగు, ఆంగ్లం వంటి ప్రముఖ భాషలతో పాటు ఇంకొన్ని విదేశీ భాషల్లో రూపొందిస్తారట. దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతమేనని ఎన్నో సందర్భాల్లో చెప్పారు.