సీక్వెల్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్

Published on Jun 18, 2019 10:41 pm IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలు మూడు షూటింగ్ దశలో, ఇంకోకటి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా కొద్దిసేపటి క్రితమే కోటా సినిమాను అనౌన్స్ చేశారాయన. అది కూడా తన గత హిట్ ‘లూసిఫర్’కు సీక్వెల్. పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీష్ వద్ద సుమారు 200 కోట్లు రాబట్టుకుంది. తెలుగులో సైతం విడుదలై పర్వాలేదనిపించుకుంది.

ఇప్పుడు ఈ పొలిటికల్ డ్రామాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు. దీన్నికూడా పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేయనున్నారు. దీనికి ‘ఎంపురాన్’ అంమే టైటిల్ ఫిక్స్ చేశారు. మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుండే రెండవ భాగం మొదలవుతుందట. ఇది కూడా తెలుగులోకి డబ్ కానుంది. ‘జనతా గ్యారేజ్, మన్యం పులి’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మోహన్ లాల్ సినిమాల పట్ల ఆసక్తి పెరిగిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More