ఎన్టీఆర్ కి బాబాయ్ గా సూపర్ స్టార్ !

Published on Apr 7, 2020 3:00 am IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించాడని.. మోహన్ లాల్ కూడా ఆ ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజగా ఈ వార్తకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. సినిమాలో మోహన్ లాల్, ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో నటించబోతున్నాడట. ఎందుకంటే కొమరం భీమ్ జీవితంలో ఆయన బాబాయి పాత్ర చాల కీలకం అట, భీమ్ లో పోరాట తత్వాన్ని చిన్నప్పుడే ‘బీమ్ బాబాయ్’ బీమ్ కు నూరిపోశాడట.

ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అలాగే ఇతర కీలక పాత్రల కోసం విదేశీ నటీనటుల్ని ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. మరో ప్రత్యేక పాత్రలో అజేయ్ దేవగణ్ ను నటిస్తున్నాడు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More