సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. కాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను మహేష్ బాబు పూర్తి చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాత అనిల్ సుంకర తాజాగా ట్వీట్ చేశారు. జనవరి 11న రెడీగా ఉండడి అని పోస్ట్ చేశారు. మొత్తానికి ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చింది.
కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


