సూపర్ స్టార్ చేతుల మీదుగా ‘సమ్మోహనం’ ట్రైలర్ !

Published on May 29, 2018 10:36 am IST

‘అమీ తుమీ’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ప్రస్తుతం ‘సమ్మోహనం’ చిత్రాన్ని చేస్తున్నారు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరి కథానాయకిగా నటిస్తోంది. భిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది ఉంది.

ఇటీవల విడుదలైన టీజర్ కూడ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో చిత్ర యూనిట్ ట్రైలర్ ను సిద్ధం చేశారు. ఈ ట్రైలర్ ను సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణగారు తన పుట్టినరోజైన మే 31వ తేదీన ఉదయం 9 గంటల 18 నిముషాలకు విడుదలచేయనున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా, పిజి. విందా సినిమాటోగ్రఫీ చేశారు. జూన్ 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :