జూన్ నుండి మొదలుకానున్న సూపర్ స్టార్ సినిమా !

Published on May 29, 2018 8:23 am IST

యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ సినీ వర్గాల సంచారం మేరకు ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ జూన్ మొదటి వారంలో మొదలవుతుందని సమాచారం. మొదటి షెడ్యూల్ ను ఎక్కువ భాగం ఉత్తరాఖాండ్ లోని హిమాలయాల్లో చిత్రీకరిస్తారట.

ఈ షెడ్యూల్లో రజనీతో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ నటులు విజయ్ సేతుపతి, బాబీ సింహలు నటిస్తుండగా రజనీకి జోడీగా అలనాటి స్టార్ హీరోయిన్ సిమ్రన్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. రజనీ, సుబ్బరాజ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రంపై తమిళ సినీ ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :