“వకీల్ సాబ్”పై సుప్రీం కోర్ట్ జడ్జ్ ప్రశంసల జల్లు.!

Published on Apr 20, 2021 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాల నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” కు రీమేక్ గా శ్రీరామ్ వేణు తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో లాయర్ గా పవన్ ఇచ్చిన అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

కానీ ఇప్పుడు పవన్ నటనకు గాను ఏకంగా సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడ కొనియాడారు. వకీల్ సాబ్ లో పవన్ నటన అద్భుతం అని అలాగే పవన్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు ఇలాంటి సినిమా చెయ్యరు అని కానీ పవన్ ఈ సినిమాను చేసి నటించడం కాదు జీవించేశారని ప్రశంసించారు.

అంతే కాకుండా ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ దేశంలో అగ్ర నటులు నుంచే కాకుండా ప్రపంచ సుతఃయి నటుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయని నాకు తెలిసి ఏ నటుడికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కలేదు అందుకే వకీల్ సాబ్ ఒక ఉత్తమ చిత్రంగా చిరస్థాయిలో నిలుస్తుంది అని వకీల్ సాబ్ పై ఆయన ఓ రేంజ్ లో ప్రశంసల జల్లు కురిపించారు.

సంబంధిత సమాచారం :