
‘బీరువా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి, మొదటి సినిమాలో తన అందం మరియు పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత సురభి మరో బిగ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. అదే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో మంచు మనోజ్ హీరోగా చేస్తున్న ‘ఎటాక్’. ఈ సినిమాలో మనోజ్ సరసన సురభి కనిపించనుంది. ఈ సినిమాలో ఇంతమంది స్టార్ మధ్యలో తనకు ప్లేస్ దొరకడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని సురభి అంటోంది.
రామ్ గోపాల్ వర్మని తెగ పొగిడేస్తున్న ఈ భామ ‘వర్మ హీరోయిన్స్ ని ఓ అందమైన పెయింటింగ్ లా చూపిస్తారు. అందుకే తన హీరోయిన్స్ కి గ్లామర్ డాల్స్ గా అంత పేరు వస్తుంది. అలాగే హీరోయిన్ కి ఉన్న ఇన్నోసెంట్ హీరోయిన్ అనే ముద్ర చెరిగిపోతుందని’ సురభి అంటోంది. చూస్తుంటే సురభి కూడా ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించేలా ఉంది. ఇటీవలే సురభి రిలీజ్ చేసిన ఫోటో షూట్ కూడా హాట్ హాట్ గా ఉంది. ఎటాక్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంచు మనోజ్, సురభిలతో పాటు జగపతి బాబు, వడ్డే నవీన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి కల్లా షూటింగ్ ఫినిష్ చేసి ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

