‘సైరా’లో అమితాబ్ ఉన్నారంతే !
Published on Feb 19, 2018 4:51 pm IST

మెగాస్టార్ చిరు 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్యలో అమితాబ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని రకరకాల వార్తకు వచ్చాయి. ఏ.ఆర్.రెహమాన్ కూడ చిత్రం నుండి వైదొలగడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. దీనికి తోడు మెగా కాంపౌండ్ నుండి కూడా స్పందన లేకపోవడంతో చాలా మంది అమితాబ్ ఈ సినిమాలో నటించరని అనుకున్నారు.

కానీ వాళ్ళ అనుమాలకి, పుకార్లకి సమాధానం అన్నట్టు ఈరోజు చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి అమితాబ్ ను కలిసి, తమ సమావేశానికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో అమితాబ్ చిరుతో కలిసి నటించడం ఖాయమని తేలిపోయింది. త్వరలో ఆయన తన పాత్ర తాలూకు షూటింగ్లో కూడ పాల్గొననున్నారు. రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి వంటి వారు కూడా నటించనున్నారు.

 
Like us on Facebook