‘కిక్ 2’పై కంటిన్యూగా వర్క్ చేస్తున్న సురేందర్ రెడ్డి

‘కిక్ 2’పై కంటిన్యూగా వర్క్ చేస్తున్న సురేందర్ రెడ్డి

Published on Jun 23, 2015 9:44 AM IST

surendar-reddy
‘రేసుగుర్రం’ లాంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ సురెంద్రార్ రెడ్డి చేసిన క్రేజీ సీక్వెల్ ‘కిక్ 2’. 2009లో తన డైరెక్షన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన కిక్ సినిమాకి ఇది సీక్వెల్. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ సీక్వెల్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. జూన్ లో ఉండాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దానికి కారణం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం. సురేందర్ రెడ్డి కంటిన్యూగా కిక్ 2 మీద వర్క్ చేస్తున్నాడు.

తను కంటిన్యూగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొంటూ సినిమా డిఫరెంట్ వెర్షన్స్ కట్స్ చూస్తున్నాడు. అలాగే సినిమాని చాలా స్టైలిష్ గా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతే కాకుండా టెక్నికల్ టీం కూడా సౌండ్ మిక్సింగ్, డిఐ, సిజి ఎఫెక్ట్స్ విషయంలో ది బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా వర్క్ చేస్తున్నారు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కిక్ 2 సినిమాని జూలై చివర్లో లేదా ఆగష్టు మొదట్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

తాజా వార్తలు