పవన్ కోసం ఆ భామను రిపీట్ చేయనున్న సురేందర్ రెడ్డి..?

పవన్ కోసం ఆ భామను రిపీట్ చేయనున్న సురేందర్ రెడ్డి..?

Published on Feb 20, 2026 5:02 PM IST

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ తన నెక్స్ట్ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ‘ఫౌజీ’ ఫేమ్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుందనే వార్త చక్కర్లు కొడుతోంది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా కోసం మరో భామ సాక్షి వైద్యను హీరోయిన్‌గా తీసుకునేందుకు సురేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడట. ఇమాన్వి స్థానంలో సాక్షి అయితే బాగుంటుందని.. పవన్ పక్కన ఫ్రెష్ కాంబినేషన్‌గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ చిత్రంలో కూడా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మరి ఇప్పుడు నిజంగా పవన్ పక్కన ఛాన్స్ ఆమె కొట్టేస్తుందా లేదా.. అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు