తరుణ్ భాస్కర్ తో వరుసగా సినిమాలు నిర్మించనున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ !

తరుణ్ భాస్కర్ తో వరుసగా సినిమాలు నిర్మించనున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ !

Published on Jun 20, 2018 1:14 AM IST


పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ .ఎలాంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్లో తెరకెక్కి సంచలనం విజయం సాధించింది పెళ్లి చూపులు . ఇక ఈ సీనిమా తరువాత ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నుండి వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ .

ఈ ప్రొడక్షన్లో 3 సినిమాలకు సైన్ చేశాడు ఈ డైరెక్టర్ . దాంట్లో భాగంగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన’ ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఈనెల 29 న ప్రేక్షకులముందుకు రానుంది. వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కిన ఈ సినిమా ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి . పెళ్లిచూపులు సినిమాలాగే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు . ఈ సినిమా తరువాత మరో రెండు చిత్రాలను సురేష్ ప్రొడెక్షన్స్ లోనే చేయనున్నాడు తరుణ్ .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు