విక్రమ్ వేద రీమేక్ గురించి క్లారిటీ ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ !

Published on May 7, 2019 11:49 am IST

కోలీవుడ్ లో మాధవన్ , విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘విక్రమ్ వేద’ 2017లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో పుష్కర్ – గాయత్రి తెరక్కించిన ఈ చిత్రం 100కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం తెలుగు లో రీమేక్ కానుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా నిన్న కొన్ని వెబ్ సైట్లు ఓ అడుగు ముందుకేసి ఈ రీమేక్ లో విక్టరీ వెంకటేష్ , నారా రోహిత్ హీరోలుగా నటించనున్నారని వి వి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని రాసాయి.

దాంతో తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. విక్రమ్ వేద తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన ప్రస్తుతం వెంకీ మామ లో మాత్రమే నటిస్తున్నారు త్వరలోనే వెంకీ తదుపరి చిత్రాలను ప్రకటిస్తామని ఈ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

సంబంధిత సమాచారం :

More