‘నాగబంధం’ కోసం రంగంలోకి సురేష్ ప్రొడక్షన్స్.. ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తారంటే..?

‘నాగబంధం’ కోసం రంగంలోకి సురేష్ ప్రొడక్షన్స్.. ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తారంటే..?

Published on Jun 24, 2026 6:00 PM IST

మైథలాజికల్ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో అదిరిపోయే గ్రాఫిక్స్, హ్యూజ్ స్కేల్‌తో మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను జూలై 3న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు.

ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కృష్ణా, తూర్పు గోదావరి ప్రాంతాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ఈ చిత్రం కోసం రావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. విరాట్ కర్ణ, నభా నటేష్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కిషోర్ అన్నపురెడ్డి, నిషిత అన్నపురెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు