కొత్త వ్యాపారంలోకి సురేష్ బాబు

Published on Jun 22, 2021 7:02 pm IST

సురేష్ ప్రొడక్షన్స్ ఎన్నో మంచి సినిమాలను నిర్మించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. రామానాయుడు స్థాపించిన ఈ సంస్థను సురేష్ బాబు విజయవంతంగా నడుపుతున్నారు. ఆరంభంలో ఎలాంటి అభిరుచితో అయితే సినిమాలు నిర్మించారో ఇప్పటికీ అదే అభిరుచిని కొనసాగిస్తున్నారు. ఆయన తండ్రి రామానాయుడుగారు స్థాపించిన స్టూడియోస్ దశాబ్దాలుగా ఇండస్ట్రీకి సేవలు అందిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు సురేష్ బాబు.

ఇలా సినీ రంగంలోని పలు విభాగాల్లో తనదైన ముద్రవేసిన సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి ఆడియో రంగంలోకి అడుగు పెడుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పేరుతో కొత్త మ్యూజిక్ లేబుల్ ఏర్పాటు చేస్తున్నారట. ఇప్పటివరకు ఆడియో రంగంలో ఆదిత్య మ్యూజిక్ అగ్రగామి సంస్థగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు సురేష్ బాబు ఎంట్రీతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇకపోతే సురేష్ బాబు ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ‘నారప్ప’ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :