‘సూర్య – శివ’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Aug 12, 2019 12:50 pm IST

తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో సినిమాకి రంగం సిద్ధం అయింది. సూర్య 39వ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలను ఈ రోజు సాయంత్రం 5:40 గంటలకు ప్రకటించనున్నారట మేకర్స్. ఇక సూర్య – శివ కాంబినేషన్ అంటే.. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండనుంది. వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకున్నా.. ఎట్టకేలకూ అది ఇప్పుడు మొదలుకానుంది.

దీనికి తోడు సూర్య ఫాన్స్ సూర్యని ఎలా చూడాలనుకుంటారో.. అంతకు మించి పవర్ ఫుల్ గా సూర్యని చూపించాలనుకుంటున్నాడట శివ. అందుకే గతంలో శివ తీసిన సినిమాలకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే శివ, అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించి తమిళంలో భారీ విజయాన్ని అందుకున్నాడు. కానీ తెలుగులో మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మరి శివ – సూర్య కాంబినేషన్ లో వచ్చే సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధిస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :