“సూర్య 42” ఊహలకు మించే ఉంటుందా?

Published on Mar 7, 2023 11:00 am IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం కూడా ఒకటి. సూర్య కెరీర్ లో 42వ సినిమాగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం మాసివ్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాపై ఉన్న అంచనాలకి తగ్గట్టు గానే ఇంకా చెప్పాలంటే అంతకు మించే లెవెల్లో సినిమా వస్తుందట.

అంతే కాకుండా సినిమాలో చాలా ఆశ్చర్యకర అంశాలు ఉంటాయని. అలాగే సినిమా భారీ స్కేల్ లో చాలా గ్రాండ్ గా ఊహించని లెవెల్లో ఉంటుంది అని అంతేకాకుండా ఇటీవల వచ్చిన పలు బిగ్గెస్ట్ చిత్రాల్లో ఒకటిగా ఇది ఉంటుంది అని అంటున్నారు. అంటే ఓ లార్జర్ దన్ లైఫ్ టైప్ సినిమాల్లో ఒకటిగా ఇది ఉండనుంది అని టాక్. ఆల్రెడీ మోషన్ పోస్టర్ తోనే మేకర్స్ ఎనలేని హైప్ తీసుకొచ్చింది. మరి సినిమా అయితే ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :