దర్శకుడికి కార్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరోలు !

దర్శకుడికి కార్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరోలు !

Published on May 11, 2025 7:59 PM IST

karthi

‘96’ ఫేమ్‌ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెయ్యజగన్‌’. తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో విడుదల అయింది. ఫీల్‌గుడ్‌ కథతో వచ్చిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. అయితే.. దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ ఎన్నో ఏళ్ల కలను తాజాగా సూర్య, కార్తి నెరవేర్చారు. ప్రేమ్‌కుమార్‌ మహీంద్రా థార్‌ అంటే ఎంతో ఇష్టం. కాగా దాన్ని ఆయనకు సూర్య – కార్తి గిఫ్ట్‌ గా అందించారు.

ఈ గిఫ్ట్ పై ప్రేమ్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేస్తూ ‘‘మహీంద్రా థార్‌ అంటే నాకెంతో ఇష్టం. అది నా డ్రీమ్‌ వెహికల్‌. 5 డోర్‌ వెర్షన్‌ కోసం ఎంతోకాలంగా ఎదురుచూశా. మరీ ముఖ్యంగా Roxx AX 5L తెలుపు రంగు థార్‌ కోసం వేచి చూశాను. ఎట్టకేలకు అది మార్కెట్‌లోకి వచ్చింది. దాచుకున్న డబ్బుతో దానిని కొనుగోలు చేయాలనుకున్నా. కాకపోతే బుక్‌ చేశాక ఏడాది పాటు ఎదురుచూడాలని తెలిసింది. ఆ తర్వాత నా దగ్గర ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోయింది. దీంతో నా కలను విరమించుకున్నా. ఐతే, సూర్య నాకోసం ఈ కారు కొని గిఫ్ట్‌గా ఇచ్చారు. కార్తి చేతుల మీదుగా కారు తాళాలు అందుకున్నా. దీనిని నేను గిఫ్ట్‌గా చూడను. ఒక అన్న తన తమ్ముడి కలను నెరవేర్చినట్లు చూస్తా’’ అని పోస్ట్‌ పెట్టారు.

తాజా వార్తలు