250 మంది అభిమానులకు అండగా నిలిచిన సూర్య

Published on Jun 10, 2021 1:12 am IST

హీరో సూర్య సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే తన అగరం ఫౌండేషన్ ద్వారా అనేకమంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్న సూర్య సొసైటీకి అవరసం వచ్చినప్పుడల్లా సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ పరిస్థితుల వలన తమిళనాడులో అనేకమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ అవసరాలు కూడ తీరని వారు అనేకమంది ఉన్నారు. అందుకే సూర్య ఒకడుగు ముందుకువేసి ఇబ్బందుల్లో ఉన్న తన అభిమానులకు అండగా నిలిచారు.

తన అభిమాన సంఘంలో ఉన్న 250 మంది అభిమానులు ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున మొత్తం 12.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమచేశారు. సూర్య చేసిన ఈ సహాయానికి ఫ్యాన్స్ అందరూ కృతజ్ఞతలు చెబుతున్నారు. కొన్నిరోజుల క్రితం కూడ సూర్య కరోనా మీద పోరాటానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పాండిరాజ్, టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. ఇవి కాకుండా త్వరలో వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.

సంబంధిత సమాచారం :