కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన రెండు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ ని ఇప్పుడు అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధించి నెట్ ఫ్లిక్స్ లో నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చింది. కానీ ఇందులో వచ్చాక మాత్రం సూర్య ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు.
సెకండాఫ్ లో ఓ అర నిమిషానికి పైగానే సీన్ ని ఎలాంటి కేర్ లేకుండా ఎడిట్ టేబుల్ పై ఉన్నది ఉన్నట్టు పెట్టేసి వదిలేసారు. దాన్ని ఇప్పటికీ సెట్ చేయలేదు. ఇక దీనితో పాటుగా థియేటర్స్ లో సూర్య టైటిల్ కార్డు ‘ది వన్’ వచ్చినపుడు తన క్రేజీ హిట్ సినిమాల పాత్రలని చూపించారు. అందులో సింగం లో తాను పోషించిన నరసింహం కూడా ఒకటి.
కానీ సరిగ్గా ఇది వచ్చినపుడు పూర్తిగా బ్లాంక్ ఫ్రేమ్ పడింది. దీనితో ఫ్యాన్స్ మరింత డిజప్పాయింట్ అయ్యారు. ఎందుకు దీన్ని ఇలా చేసినట్టు? కావాలనే చేసారా? లేక టెక్నీకల్ గా లోపమా అనేది మాత్రం మేకర్స్ కి నెట్ ఫ్లిక్స్ వారికే తెలియాలి. ప్రస్తుతం అయితే ఈ రెండూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.


