సూర్య సినిమాకు కూడా ఈ ఆఫర్ వచ్చిందా.?

Published on Aug 11, 2020 3:59 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు మన దగ్గర కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా సూర్య ప్రతీ సినిమాకు కూడా మన దగ్గర కూడా మంచి బజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు తాను హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఆకాశం నీ హద్దురా” చిత్రం కూడా మంచి హైప్ ను తెచ్చుకోడానికి విడుదల కావాల్సిన టైం లో కరోనా దెబ్బకు ఆగిపోవాల్సి వచ్చింది. ఇక అక్కడ నుంచి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే.

ఓటిటి రంగం మరింత అభివృద్ధి చెందడంతో చాలా చిత్రాలు డైరెక్ట్ స్ట్రీమింగ్ లోనే విడుదల కావడం మొదలు పెట్టాయి. దీనితో చాలా చిత్రాలు ఓటిటి బాట పట్టాయి. ఈ చిత్రానికి కూడా ఆఫర్ వచ్చిందని టాక్ వచ్చింది. కానీ మేకర్స్ మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేసేందుకే ఆసక్తి చూపారు. కానీ ఇటీవలే తమిళ్ లో సెన్సార్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల కావడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. లేడీ డైరెక్టర్ సుధా కాంగ్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుందో ఎప్పుడు విడుదల కానుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More