కత్తి పట్టి దర్శనమిచ్చిన సూర్య

Published on Jun 8, 2021 12:30 am IST

స్టార్ హీరో సూర్య ‘సూరరై పోట్రు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ ఉత్సాహంలోనే సూర్య పలు కొత్త సినిమాలను స్టార్ట్ చేశారు. వాటిలో పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడ ఒకటి. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈరోజు దర్శకుడు పాండిరాజ్ పుట్టినరోజు కావడంతో ఇంకొక ఇంటెన్స్ లుక్ రిలీజ్ చేశారు. మొదటి పోస్టర్లో సూర్య తుపాకి పట్టుకుని కనిపిస్తే ఇందులో మాత్రం పెద్ద కత్తి పట్టుకుని మాస్ అప్పియరెన్స్ ఇచ్చారు.

ఈ పోస్టర్ సహా పాండిరాజ్ ఇంకొన్ని విశేషాలను కూడ బయటపెట్టారు. ఇప్పటికి 35 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని, లాక్ డౌన్ అనంతరం షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నామని, జూలై నెలలో టైటిల్ ప్రకటన ఉంటుందని, టైటిల్ మాత్రం చాలా మాస్ గా ఉంటుందని, కాస్త వెయిట్ చేయమని అన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా డైరెక్టర్ ఇలా పలు అప్డేట్స్ ఇవ్వడంతో సూర్య ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :